
పీడీలకు పురస్కారాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభా పురస్కారాలను ఐదు పాఠశాలలకు చెందిన పీడీలు అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత విద్యా సంవత్సరంలో (2024–25) వివిధ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఐదు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అమరావతి వారి ఆదేశాల మేరకు క్రీడాకారుల రాణింపు ఆధారంగా మొదటి ఐదు స్థానాల్లో స్కూల్స్ జాబితాను ఖరారుచేశారు. మొదటి స్థానంలో ఎంజేపీఏపీ శాస్త్రులపేట(244 పాయింట్లు), ద్వితీయ స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ అల్లినగరం (224), తృతీయ స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ ఇప్పిలి (222), నాలుగో స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ పాత్రునివలస (214), ఐదో స్థానంలో జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట (202 పాయింట్లు) నిలిచాయి. వీరికి జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, ఉప విద్యాధికారులు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి బీవీ రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.