
పీహెచ్‌డీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో పరిశోధన చేసేందుకు గాను పీహెచ్‌డీ సీట్లు భర్తీకి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. బయోటెక్నాలజీ, సోషల్‌వర్క్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరిపి సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. వర్శిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ కె.స్వప్నవాహినీ పర్యవేక్షణలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్, డాక్టర్ ఎం.అనూరాధ పాల్గొన్నారు.