
పరిమితికి మించి ప్రయాణం నేరం
నిమజ్జనం.. జరభద్రంవినాయక మండపాలు భారీగా ఏర్పాటు చేశారు. నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. –8లో
విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలను ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ వేసి మరీ పట్టుకుంటున్నాం. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలపై ఈ ఏడాది ఇప్పటివరకు 39 కేసులు నమోదు చేశాం. ఒక్క జూలైలోనే 18 నమోదయ్యాయి. ఇక లేబర్‌ను తీసుకెళ్లే ఆటోలపైనా నిబంధనలు మీరితే చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు మూడు వేలకు పైగా ఆటోలున్న మన జిల్లాలో ఎప్పటికప్పుడు డ్రైవర్లకు రోడ్డు నియమ నిబంధనలపై కౌన్సిలింగ్ చేస్తున్నాం.
– నాగరాజు, సీఐ, ట్రాఫిక్
శ్రీకాకుళం క్రైమ్:
తల్లిదండ్రుల ఏమరపాటు, కొందరు డ్రైవర్ల అత్యాశ, అధికారుల అలసత్వం కలగలిపి.. ప్రతి ఉదయం పసి ప్రాణాలకు పరీక్ష ఎదురవుతోంది. భుజాన బండెడు బరువు మోసుకుంటూ బడికి వెళ్లడం కోసం వాహనం ఎక్కే విద్యార్థులకు సురక్షిత ప్రయాణం గగనమైపోతోంది. అయితే వ్యానులో కిక్కిరిసి వెళ్లడమో, లేదంటే ఆటో వెనుక కూర్చుని వెళ్లడమో లేదంటే స్కూలు బస్సులో ఇనుప జాలీల వెనుక నుంచి గాలి తగలని పరిస్థితుల్లో దీనంగా బయటకు చూస్తూ ప్రయాణించడమో జరుగుతోంది.
వేగంగా పిల్లలను స్కూల్‌లో దింపి వేరే సర్వీసుకు వెళ్లిపోవాలనే ఆలోచన ప్రైవేటు వాహనాలకు ఉంటుంది. నిబంధనలను మీరి స్పీడ్ పెంచడం, రాంగ్‌రూట్‌ల్లో ఎదురుగా వస్తున్న వాహనాలను పట్టించుకోక పరిగెత్తించడంతో అప్పటికే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్న వాహనాలు ప్ర మాదాలకు గురై పసివారు బలైపోతున్నారు. తాజా గా శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఆటో ప్రమాదంలో మృతిచెందాడు.
ప్రైవేటు వాహనాలే గతి..
జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులను చేరవేసేందుకు ప్రైవేటు వాహనాలే దిక్కు. ముఖ్యంగా ఒక కిలోమీటరు నుంచి ఐదు కిలోమీటర్ల లోపు ఉండే స్కూళ్లకు బస్సు సదుపాయం లేక తల్లిదండ్రులు కొందరు ఆటోవాలాలకు, వ్యాన్లకు నెలకు ఇంతిస్తామని సంప్రదించి పెట్టుకుంటున్నారు. ఆటోకు పర్మిట్, ఇన్స్యూరెన్సు, ఫిట్‌నెస్ పత్రాలు ఉండడంతో పాటు ఆరుగురికి మించి విద్యార్థులు ప్రయాణించకూడదని నిబంధనలున్నా ఎవరూ అ వి పాటించడం లేదు. వ్యాన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తల్లిదండ్రులు కూడా తక్కువ మంది వి ద్యార్థులను తీసుకెళ్లే ఆటోల్లోనే పంపించాలని, అదీ నిర్ణీత సమయంలోగా పంపించాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కాక ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
వాహనం వెనుక వేలాడుతూ బడికి వెళ్లేంత ఖర్మ పిల్లాడికి ఏం పట్టింది..? ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేకుండా కిక్కిరిసి కూర్చోవాల్సిన అవస్థ ఏముంది..? కండీషన్‌లో ఉందో లేదో తెలీని బండిలో విద్యార్థిని పంపించేంత అజాగ్రత్త ఎందుకు..? ప్రతి ఉదయం చాలా మంది విద్యార్థులు ఈ అవస్థలు పడుతూనే బడికి వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు ఏ చిన్న ప్రమాదం జరిగినా బతుకంతా బాధ పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే తల్లిదండ్రులు మేల్కోవాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలను బడికి పంపే వాహనాలను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కోరుతున్నారు.
ప్రతి నిత్యం వాహనాల్లో ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణాలు
తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని అధికారుల సూచనలు
పిల్లలను తీసుకెళ్లే వాహనాలు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్న పోలీసులు