
రైల్వే గేటు మూసివేత నేడు
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పరిధి ఊసవానిపేట రైల్వే గేటు శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మూసి వేయనున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఉర్లాం–శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతులు పనులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ గేటు మూసి వేస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే నరసన్నపేట రోడ్డులో ఈ గేటు ఉండడంతో ముందస్తుగా సమాచారం ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించి వేరే రహదారుల గుండా ప్రయాణించాలని ఆయన కోరారు.
130 మంది సర్టిఫికెట్ల పరిశీలన
శ్రీకాకుళం: డీఎస్సీ నియామక ప్రక్రియలో శుక్రవారం 130 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. తొలి రోజున 403 మంది అభ్యర్థుల పత్రాలు పరిశీలించిన విషయం పాఠకులకు తెలిసిందే. మిగిలిన 140 మందిలో 130 మందికి మాత్ర మే కాల్ లెటర్స్ రావడంతో వారు ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. ఈ 130 మందిలో ఏడుగురికి పూర్తిస్థాయిలో ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వాటిని తీసుకొని శనివారం ఉదయం 10 గంటల్లోగా రావాలని అధికారులు సూచించారు. మిగిలిన 126 మందిలో ఇద్దరు ఉద్యోగం చేపట్టేందుకు అయిష్టతను లిఖితపూర్వకంగా తెలియజేశారు. జిల్లా నుంచి పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్ వంటి జోన ల్ స్థాయి పోస్టులకు అర్హత సాధించిన వారికి విశాఖపట్నంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతోంది. జిల్లా నుంచి ఈ పోస్టులకు ఎంతమంది ఎంపికయ్యారు అన్నది కూడా అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. అయితే మొత్తం 543 మందికి కాల్ లెటర్స్ రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 533 మందికి మాత్రమే పత్రాల పరిశీలనలకు పిలుపు వచ్చింది. మిగిలిన వారికి ఎందుకు రాలేదనే సందేహం వ్యక్తమవుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం శనివారం ఉదయంలోగా మిగిలిన పదిమందికి మెసేజ్‌లు వస్తాయని చెబుతున్నారు.
‘వైఎస్సార్‌ను స్మరించుకుందాం’
నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ శ్రే ణులు ఊరూరా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. వైఎస్సార్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులర్పించాలన్నారు. పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని కోరారు.
గిడుగు స్వగ్రామంలో
ఘనంగా జయంతి వేడుకలు
సరుబుజ్జిలి: వ్యావహారిక భాషా పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు ఆయన స్వగ్రామం అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బెవర కృష్ణవేణి, ఎంఈఓ డి.బాలరాజు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. వ్యవహారి క భాషా అమలులో అంతర్జాతీయ స్థాయిలో గిడుగు ప్రఖ్యాతి గడించారని అన్నారు.
‘మా ఊరి పేరు మార్చండి’
మెళియాపుట్టి: తమ ఊరి పేరే తమకు సమస్యగా మారిందని పడ్డ గ్రామ పంచాయితీ పరిధిలోని సానిపాలెం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ పాపారావుకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గ్రామం పేరు వల్ల అవమానాలు ఎదురవుతున్నాయని, గ్రామానికి రామయ్య పాలెం అని పేరు మార్చాలని కోరారు.

రైల్వే గేటు మూసివేత నేడు

రైల్వే గేటు మూసివేత నేడు

రైల్వే గేటు మూసివేత నేడు