నిమజ్జనం.. సురక్షితం..
● భక్తులకు రక్షణగా ‘లైఫ్ సేవింగ్’
బృందం
● అవాంఛనీయ ఘటనలకు
తావులేకుండా సేవలు
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: గణపతి నిమజ్జనోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర, జాతీయ స్థాయి స్విమ్మర్లతో కూడిన లైఫ్ సేవింగ్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా బృందం తనవంతు సేవ చేస్తోంది. లైఫ్ సేవింగ్ నేషనల్ మెడలిస్ట్ షేక్ సుభాన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలను చేపడుతున్నారు. శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం వద్ద గణపతి నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైఫ్ సేవింగ్ బృందం నిర్వహిస్తున్నారు. పాలిథిన్ కవర్లు, గోనెసంచులు వేయకుండా భక్తుల చేతనే డస్ట్ బిన్స్‌లో వేయించి నది కలుషితం కాకుండా చేస్తున్నారు. రెండురోజులు భారీ వర్షాలతో నాగావళి నదికి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. భక్తులు లోనికి రాకుండా రోప్‌గా ఏర్పడి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుభాన్‌తోపాటు లైఫ్ సేవింగ్ ప్రతినిధులు స్వామి లక్ష్మణ్, అప్పన్న, రాజేష్, ఈసుశ్రీ, సత్తిరాజు, సహదేవుడు తదితరులు సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లగా లైఫ్ సేవింగ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సమయంలో భక్తుల సహాయార్ధం సేవలు అందిస్తున్నట్టు స్విమ్మర్లు తెలిపారు. వీరి సేవలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులు, సంఘ ప్రతినిధులు సైతం ప్రశంసిస్తున్నారు.


