
మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. 2000లో చంద్రబాబు నాయుడు తెచ్చిన విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా విద్యుత్ పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్‌బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామికి గురువారం నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూఅప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఎం నాయకులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, ఆర్.ప్రకాష్‌రావు, ఎం.గోపి, కె.సూరయ్య, పాణి గ్రహి, ఎం.లక్ష్మి, శ్రీదేవి, డి.గణేష్, ఎస్.కృష్ణవేణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.