ఎట్టకేలకు కొనసాగింపు ఉత్తర్వులు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కొనసాగింపు ఉత్తర్వులు

Aug 29 2025 6:59 AM | Updated on Aug 29 2025 9:16 AM

ఎట్టకేలకు కొనసాగింపు ఉత్తర్వులు

ఎట్టకేలకు కొనసాగింపు ఉత్తర్వులు

సారవకోట: డీఎల్‌డీఏ చైర్మన్‌కు సంబంధిత అధికారులు ఎట్టకేలకు ఈ నెల 26న ఉత్తర్వులు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వ హయాంలో సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన నక్క తులసీదాస్‌ను జిల్లా లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ చైర్మన్‌కు 2023 డిసెంబర్‌ 4న ఏకగ్రీవంగా ఏజెన్సీ సభ్యులు ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్‌ పోస్టుల్లోఉన్న వారిని రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 దీంతో కొందరు డీఎల్‌డీఏ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మన జిల్లాలో కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడటంతో సంబంధిత శాఖాధికారులు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎట్టకేలకు కలెక్టర్‌ సూచనల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు అందజేశారు. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా మబగాంలో ప్రొసీడింగ్‌ పత్రాలను తులసీదాస్‌ అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement