గందరగోళం
● డీఎస్సీ నియామక ప్రక్రియలో
● అభ్యర్థికి తప్ప ఇంకెవరికీ తెలియని మార్కులు, ఎంపిక వివరాలు
● రాష్ట్రస్థాయిలోనే మెరిట్ కమ్ రోస్టర్ జాబితా
శ్రీకాకుళం:
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నియామకాల ప్రక్రియకు సంబంధించి చేపడుతున్న విధానా లు గందరగోళంగా మారాయి. గతంలో అభ్యర్థుల మార్కులను ప్రక టిస్తూ మెరిట్ జాబితాను డీఈఓ కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచేవారు. అటు తర్వాత మెరిట్ కమ్ రోస్టర్ జాబితాను కూడా నోటీస్ బోర్డులో ఉంచేవారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించి, తుది జాబితాను విడుదల చేసి ధృవీకరణ పత్రాలు పరిశీలన జరిగేది. ఈ సారి అలాకాకుండా ప్రక్రియ అంతా రా ష్ట్రస్థాయిలోనే జరుపుతున్నారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఎంపికై న అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరవ్వాలని సూచించారు. రాష్ట్రస్థాయిలోనే ప్రక్రియ అంతా చేపట్టడం ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారి అని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీని వల్ల ఎవరికి ఎన్ని మా ర్కులు వచ్చాయి? మెరిట్ విధానంలో ఏవైనా తప్పు లు జరిగాయా? రాష్ట్ర పాయింట్లలో పొరపాట్లు దొర్లాయా? అనేది పరిశీలించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఉపాధ్యా య సంఘాలతో పాటు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియను ఇలా గోప్యంగా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థుల సందేహాలను సైతం నివృత్తి చేయలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. 403 మందిలో ఎవరు ఏ పోస్టుకు ఏ పాఠశాలకు ఏ కేటగిరీకి ఎంపికయ్యారో కూడా తెలియ డం లేదు. కొందరు అభ్యర్థులు రెండు నుంచి మూ డు పోస్టులకు ఎంపిక కావడంతో ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థుల నుంచి కావాల్సిన పోస్టు వివరాలను తెలుసుకొని ఆ అభ్యర్థి వదులుకున్న పోస్టులకు అటు తర్వాత ర్యాంకుల వారికి కాల్ లెటర్లు పంపిస్తారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అది కూడా తమకు రాష్ట్రస్థాయి నుంచి అందిన మౌఖిక సమాచారం అని వారు చెబుతున్నా రు. ఇందులో వాస్తవం ఎంత అన్నది కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
కేజీబీవీ పీఈటీలపై అభ్యర్థుల ఫిర్యాదు
జిల్లాలోని కేజీబీవీలో పీఈటీలుగా పనిచేస్తూ డీఎస్సీ నుంచి పీఈటీలుగా ఎంపికైన వారిపై కొందరు అ భ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎంపిౖకైన పీఈటీలు కేజీబీవీలో పనిచేస్తూనే పీఈటీ శిక్షణ పూర్తి చేసిన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకున్నారని, రెండు చోట్ల ఒకేసారి చేయడం ఎలా సాధ్యపడిందని వారు జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయికి నివేదిస్తానని డీఈఓ తెలిపారు.
తొలి రోజు 403 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో తొలి రోజు గురువారం 403 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. వాటిని రాష్ట్రస్థాయికి ఆన్‌లైన్ ద్వారా నివేదించారు. అన్ని యాజమాన్యాల పా ఠశాలలకు సంబంధించి మొత్తం 543 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 403 మందికి మాత్రమే కాల్ లెటర్స్ రావడంతో వారంతా పత్రాల పరిశీలనకు వచ్చారు.
గందరగోళం


