‘వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్’
టెక్కలి: జిల్లాలో వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని వ్యవసా య శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొ న్నారు. గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఎరువులు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం బఫర్ నిల్వగా ఉన్న 500 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయాలన్నారు. జిల్లా అవసరాలకు తగిన విధంగా ఎరువులను తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ విభాగంలో భాగంగా పలు వినతులు స్వీకరించారు. దివ్యాంగులకు పునఃపరిశీలన పేరుతో విచారణ చేపట్టి పింఛన్లు తొలగిస్తున్నారంటూ పలువురు మంత్రికి విన్న వించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
బియ్యం ప్యాకెట్ల తూకాల్లో తేడాలు
నరసన్నపేట: బియ్యం ప్యాకెట్ల తూకాల్లో తేడాలు ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వినియోగదారులను వ్యాపారులు మో సం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల జిల్లా ఇన్‌స్పెక్టర్ చిన్నమ్మి అన్నా రు. కలెక్టర్‌కు ఈ మేరకు స్థానికులు ఫిర్యా దులు చేయగా గురువారం నరస్ననపేట, పోలాకి మండలాల్లో తనిఖీలు చేశామని ఒక కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు. 26 కిలోల బియ్యం ప్యాకెట్లపై ముద్రించి 25 కిలో లు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దీనిపై నరసన్నపేట, పోలాకిలో మూడు కేసులు నమోదు చేశామన్నారు. నరసన్నపేటలో తనిఖీలు నిర్వహించగా పలు షాపులు మూసేశారని పేర్కొన్నారు.
వరద ముంపులో
600 ఎకరాలు
నరసన్నపేట: మండలంలో మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు వరి పంట పొలాలు నీట మునిగాయి. మండలంలోని పలు గ్రా మాల్లో సుమారు 600 ఎకరాల వరకు ముంపునకు గురైంది. సుందరాపురం, చిక్కాలవల స, మామిడి వలస, బొరిగివలస తదితర గ్రామాల్లో ఈ వరి పంట పొలాలు మునిగిపోయాయి. వారం కిందట ఇదే విధంగా మునిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాతపట్నం: మండలంలోని పాతపట్నం పంచాయతీ, కాపు గోపాలపురం గ్రామానికి చెందిన రేగేటి వజ్రమ్మకు చెందిన పూరిల్లు ఇటీవల కురిసిన వానకు కూలిపోయింది. బుధవారం రాత్రి సమయంలో వసంతమ్మ ఇంటిలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. ఆ ఇంటిలో ఒక్క వజ్రమ్మ ఉంటుంది. గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. గురువారం గ్రామ రెవెన్యూ అధికారి (వీర్వో) కూలిన పూరిళ్లు పరిశీలించి, వివరాలు నమోదు చేసుకుని, ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామన్నారు. ప్రభు త్వం ఆదుకోవాలని వజ్రమ్మ వేడుకుంటోంది.
‘వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్’
‘వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్’
‘వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్’


