జీతాలు మహాప్రభో..! | - | Sakshi
Sakshi News home page

జీతాలు మహాప్రభో..!

Aug 27 2025 9:45 AM | Updated on Aug 27 2025 9:45 AM

జీతాలు మహాప్రభో..!

జీతాలు మహాప్రభో..!

ట్రిపుల్‌ ఐటీ కాంట్రాక్టు సిబ్బందికి

నేటికీ అందని వైనం

ఎచ్చెర్ల: అధికారంలోకి వస్తే ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందజేస్తాం. ఇవి ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఈనెలలో 26వ తేదీ గడిచినా జీతాలు రాక ట్రిపుల్‌ ఐటీ కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బంది పడతున్నారు. ఇచ్చే అరకొర వేతనాలను ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే పూట గడిచేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో వేతనాలు ఆలస్యమైతే సిబ్బందికి వారి జీతంలో 50 శాతం సొమ్మును అడ్వాన్సుగా చెల్లించేవారు. అలా తీసుకున్న సొమ్మును జీతాలు ఇచ్చేటప్పుడు మినహాయించేవారు. ఇప్పుడు అడ్వాన్సులు కూడా ఇవ్వకపోవడంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రుణాలు చెల్లించేందుకు అప్పులు

కాంట్రాక్టు అధ్యాపకులందరూ ఆర్థిక వెసులుబాటును బట్టి గృహావసరాల కోసం రుణాలు తీసుకుంటారు. బ్యాంకుల్లో చేసిన అప్పులకు క్రెడిట్‌ కార్డులపై తీసుకున్న వాటికి బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా డబ్బులు సిద్ధంగా ఉంచాలి. దీంతో అప్పులు చేసి ఖాతాలో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఎంఐలకు సరిపడా నగదు లేకపోతే సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కుటుంబం గడవడానికి, పిల్లల ఫీజులు చెల్లించడానికి అనేక అవసరాలకు డబ్బులు అవసరం కాగా అప్పు చేయాల్సి వస్తోంది. సకాలంలో జీతాలు ఇస్తే ఈ తలనొప్పి ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

140 మంది కాంట్రాక్టు ఉద్యోగులు

కాంట్రాక్టు పద్ధతిలో మెంటార్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, గెస్ట్‌ ఫ్యాకల్టీలు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఐటీ మెంటార్లు పనిచేస్తున్నారు. వీరందరూ కలిపి 140 పైగానే ఉంటారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు యూనివర్సిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇంతవరకూ వేతనాలు చెల్లించలేదు. అందువలన ఇకనైనా సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement