కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

Aug 25 2025 9:02 AM | Updated on Aug 25 2025 9:05 AM

నరసన్నపేట: మండల కేంద్రం గాంధీనగర్‌ కూడలిలో పోలాకి వెళ్లే దారిలో ఆదివారం ఉదయం కారును ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందుభాగం నుజ్జుగా మారింది.

పశువుల అక్రమ రవాణాపై కేసు నమోదు

కవిటి: కొజ్జీరియా టోల్‌ప్లాజా వద్ద పశువుల అక్రమ రవాణాను కవిటి పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఒడిశావైపు నుంచి విజయనగరంలోని అలమండ పశువుల సంతకు వెళ్తున్న ఐషర్‌ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేయగా 14 దున్నపోతులు, 2 గేదెలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని కంచిలి మండలం గొల్లకంచిలికి చెందిన గణప వాసులు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి పశువులను కొత్తవలసలోని హెల్పింగ్‌హ్యాండ్స్‌ సంస్థ అప్పగించినట్లు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో హేమశ్రీ ప్రతిభ

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లాకు చెందిన డి.హేమశ్రీ సత్తాచాటింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని దక్కించుకుంది. హేమశ్రీ స్వస్థలం బూరవెల్లి గ్రామం. డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఇటీవలే ఖేలో ఇండియా మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లోనూ 53 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధించి శభాష్‌ అనిపించుకుంది. హేమశ్రీ రాణింపు పట్ల డీఎస్‌డీఓ శ్రీధర్‌రావు, కోచ్‌ ఇప్పిలి అప్పన్న, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.

పీడీ–పీఈటీ సంఘానికి రూ.లక్ష వితరణ

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం పీడీ–పీఈటీ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు, ఒలింపిక్‌ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అభివృద్ధికి బాసటగా నిలిచారు. నగరంలోని టీపీఎంహెచ్‌ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేసి ఇటీవలి ఉద్యోగ విరమణ చేసిన చేసిన సాంబమూర్తి తనవంతుగా రూ.లక్ష వితరణగా అందజేశారు. ఆదివారం జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ ముఖ్య సలహాదారు పి.సుందరరావు, జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

నీట్‌లో బోరుభద్ర విద్యార్థినుల ప్రతిభ

సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్రకు చెందిన ముగ్గురు విద్యార్థినులు నీట్‌ పరీక్ష ఫలితాత్లో సత్తా చాటారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మార్పు కోమలి, మార్పు హస్బతో పాటు అదే గ్రామానికి చెందిన వజ్జ యోషిత ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. మార్పు కోమలి, హస్బల తండ్రి శ్రీనివాసరావు విశాఖ పట్నంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా తల్లి సీత గృహిణి. అలాగే వజ్జ యోషిత తండ్రి నరసయ్య హరిశ్చంద్రపురం సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా తల్లి నీరజ గృహిణి.

మార్పు కోమలి మార్పు హస్బ వజ్జ యోషిత

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ 1
1/6

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ 2
2/6

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ 3
3/6

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ 4
4/6

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ 5
5/6

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ 6
6/6

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement