
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా
● కరిగిపోతున్న పెద్దకొండ ● పట్టించుకోని అధికారులు
సంతబొమ్మాళి: మండలం కేంద్రం సంతబొ మ్మాళిలో తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్దకొండను అక్రమార్కులు కొల్లగొట్టేస్తున్నారు. యథేచ్చగా గ్రావెల్‌ను తరలించుపోతున్నారు. రోజుకు వందలాది లోడుల ను ట్రాక్టర్‌తో రవాణా చేస్తున్నారు. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత బరితెగించారు. జేసీబీతో కొండను తవ్వేస్తూ రోడ్డు నిర్మాణ పనుల పేరిట గ్రావెల్‌ను పట్టపగలు దర్జాగా అర్‌అండ్‌బీ రోడ్డు మీదుగా తరలించుకుపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకపో యినా రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా రు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోర్టు నిర్మాణానికి టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలించినప్పుడు కొందరు స్థానికులు అడ్డుకోవడంతో నిలిచిపోయింది. ఇప్పుడు కొన్ని రోజులుగా ప్రైవేటు వ్యక్తులు టాక్టర్లు ద్వారా రోజుకు వందల లోడ్లును తరలించుకుపోతున్నా మైన్స్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెద్దకొండ కరిగిపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సంతబొమ్మాళి పెద్దకొండ నుంచి గ్రావెల్ తరలింపునకు ఎటువంటి అనుమతులు లేవు. గతంలో రెండు సార్లు చెప్పినా పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణం పేరిట తరలించుకుపోతున్నారు.
– భాస్కరరావు, వీఆర్వో, సంతబొమ్మాళి

యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా