
యువకుడికి కత్తిపోట్లు
జి.సిగడాం : గెడ్డకంచరాం గ్రామంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కల రాజశేఖర్, గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి శంకర్(గొల్లాజీ) స్నేహితులు. ఇద్దరూ కలిసే పెయింటింగ్ పనులకు వెళ్తుంటారు. ఆదివారం గెడ్డకంచరాంలో అప్పన్న అనే వ్యక్తి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఇద్దరూ వెళ్లారు. ఈ క్రమంలో మద్యం బాటిల్ విషయమై గొడవ జరిగింది. అనంతరం ఇద్దరూ బయటకు వచ్చేసి బాతువ– గెడ్డకంచరాం కూడలి వద్ద మరోసారి గొడవపడ్డారు. ఈ సమయంలో రాజశేఖర్ కింద పడిపోయాడు. శంకర్ వెంటనే ద్విచక్ర వాహనంలో ఉన్న కత్తి తీసి రాజశేఖర్ కడుపులో పొడిచాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి జి.సిగడాం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు.
కాపర్ వైర్లు చోరీ
నరసన్నపేట: తెలగవలసలో వ్యవసాయ బోర్లకు చెందిన కాపర్ వైర్లు చోరీకి గురయ్యా యి. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్యానల్ బోర్డు నుంచి స్టాటర్‌కు, స్టాటర్ నుంచి మోటారు వద్దకు వెళ్లే వైర్లు కట్ చేసి పట్టుకుపోయారు. వీటి విలువ రూ.20 వేలు ఉంటుందని అంచనా. కాపర్ వైర్ల చోరీ వల్ల వ్యవసాయ బోర్లు వినియోగించుకోలేకపోతున్నామని బాధి త రైతులు ముద్దాడ నాగేశ్వరరావు, గణేశ్వర రావు, సింహాచలం, భాస్కరరావు, బలరాం, వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.