
రాష్ట్ర పోటీల్లోనూ సత్తాచాటాలి
శ్రీకాకుళం న్యూకాలనీ:
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సమష్టిగా రాణించి విజయబాహుటా ఎగురవేయాలని ఎచ్చెర్ల ఏఆర్ ఎస్సై గంధం సత్యనారాయణ పేర్కొన్నారు. ఐదేళ్లగా బాల్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తు రాష్ట్ర,జాతీయస్థాయిలో పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారని కొనిడాయారు. ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరు వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే సబ్ జూనియర్స్, సీనియర్స్ బాలబాలికల జట్లకు క్రీడాదుస్తులను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో గంధం అజయ్ పావని దంపతులు, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.