
సెప్టెంబర్ 14న అంగన్‌వాడీ మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సెప్టెంబరు 14న పాతపట్నంలో నిర్వహించనున్న అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వేతనాల పెంపు, డీఏ, పీఆర్‌సీ, సంక్షేమ పథకాల వర్తింపు, యాప్‌ల భారం తగ్గింపు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, యూనియన్ నాయకులు పి.లతాదేవి, బి.శాంతామణి, కె.వి.హేమలత, బి.సునీత, పొన్నాడ.భూలక్ష్మి, కె.మాధవి, పి.కళావతి, కె.నారాయణమ్మ,, హేమ, ఉమ పాల్గొన్నారు.