ప్రైవేటు బస్సు ఢీకొని యువకుడు మృతి
కంచిలి: మకరాంపురం సమీపంలోని ‘ఆదివారం సంత’ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక సన్‌రాజు(24) మృతిచెందాడు. బైక్‌పై స్వగ్రామం నుంచి జాతీయ రహదారి మీదుగా జాడుపూడి వైపు వెళుతుండగా.. బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న శివదేవి ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సన్‌రాజు కేరళలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండేవాడు. మూడు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. తండ్రి వాసులు వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తండ్రి ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


