పొందూరు: గోరింట గ్రామ సమీపంలో ఆటో ఢీకొనడంతో ద్విచక్ర వాహనచోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుబర్తి ఐఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మడపాన రాజగోపాల్ ద్విచక్ర వాహనంపై గోరింట వైపు వెళ్తుండగా పొందూరు నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజగోపాల్ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్సులో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పొందూరు ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆస్పత్రికి వెళ్లి రాజగోపాల్‌ను పరామర్శించారు. ఆయనతో పాటు పెనుబర్తి నాయకులు తమ్మినేని మురళీకృష్ణ, పూర్ణ తదితరులు ఉన్నారు.