
uuయూరియా పంపిణీలో పక్షపాతమా..
వైఎస్సార్ సీపీ హయాంలో రైతులను అపురూపంగా చూసుకున్నాం. కూటమి ప్రభుత్వం మాత్రం వారి వర్గీయులకే ఎరువులు ఇస్తోంది. యూరియా పంపిణీలోనూ పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. ఇచ్ఛాపురం మండలంలో 16 రైతు సేవా కేంద్రాలకు అందించాల్సిన యూరియాను కేవలం ఐదు కేంద్రాలకే సరఫరా చేసి సొసైటీ ద్వారా కూటమి కార్యకర్తలకే అధిక మొత్తంలో సరఫరా చేశారు.
– పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్
(ఇచ్ఛాపురం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో..)