
‘పెన్షన్ల తొలగింపునకు కూటమి కుట్ర’
నరసన్నపేట: దివ్యాంగుల పింఛన్లు తొలగించేందుకు కూటమి రోజుకో కుట్ర పన్నుతోందని, రోజుకో ప్రకటన చేస్తూ దివ్యాంగుల్లో ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మా న కృష్ణదాస్ ఆరోపించారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని వదిలేసి దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లు నిలిపివేసేందుకు పన్నాగాలు పన్నుతోందన్నారు. రీ వెరిఫికేషన్, రీ ఎసెస్‌మెంట్ పేరున మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని నోటీసు లు ఇస్తుండడంపై ఆయన మండిపడ్డారు. వైకల్యం 40 శాతం కంటే తగ్గిందన్న సాకుతో పెన్షన్లు తొలగిస్తామనడం మానవత్వానికి విరుద్ధమన్నారు. పదేళ్లకు పైబడి పెన్షన్లు తీసుకుంటున్న వారు ఇప్పుడు అనర్హులు అనడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలు మాని వస్తున్న పెన్షన్లను యథావిధిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం క్రైమ్ : ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ నివారణ కోసం జిల్లాలో శనివారం ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు ముమ్మరంగా జరిగాయి. రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్‌గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి (విజిలెన్స్ ఎస్పీ) బర్ల ప్రసాదరావు తమ బృందాలతో జిల్లాలో ఏడు చోట్ల దాడు లు చేయించడమే కాక పక్క జిల్లాలైన విజయ నగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో మరో 10 చోట్ల చేయించారు. స్థానిక రెవెన్యూ, పోలీ స్, వ్యవసాయాధికారులతో కలిసి సంయుక్తంగా ఈ దాడులు జరిపారు. జిల్లాలోని గార మండలం శ్రీకూర్మంలో శ్రీ విజయలక్ష్మి ఏజెన్సీ లైసెన్స్ పునరుద్ధరణ చేయకుండా విక్ర యిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ సుమారు రూ. 7 లక్షల విలువల కలిగిన 28.4 టన్నుల ఎరువులు అమ్మవద్దని సిఫార్సు చేశారు.
వజ్రపుకొత్తూరు: పలాస రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఆదివా రం వేకువజాము రెండు గంటల నుంచి ఉద యం 9 గంటల వరకు ఏడు గంటల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకట న విడుదల చేశారు. ఆ సమయంలో రాకపోక లు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ అంతరాయాన్ని ప్రయాణికులు, వాహనచోదకులు గమనించాలని కోరారు.
శ్రీకాకుళం క్రైమ్ : మద్యం బార్ పాలసీలో నిబంధనలు అనుసరించి అనుకున్న దరఖాస్తులు రాకపోతే ఫీజు రూ. 5 లక్షలు తిరిగి వాపసు చేస్తామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు అన్నారు. శనివారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. లాటరీకి అర్హత సాధించాలంటే కనీసం 4 అప్లికేషన్లు అయినా రావాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
లైసెన్సు ఫీజులు ఇలా..
శ్రీకాకుళం కార్పొరేషన్ (11), పలాస మున్సి పాలిటీ (02)ల పరిధి 13 బార్లకు ఏడాదికి రీటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (లైసెన్సు) ఫీజుగా రూ. 55 లక్షలు, ఆమదాలవలస(02), ఇచ్ఛాపురం(02) మున్సిపాలిటీలకు రూ. 35 లక్షలు ఆరు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, హైబ్రిడ్, ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తామని, ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు చివరి గడువు అని, ఈనెల 28న జిల్లాకేంద్రంలో అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియలో డ్రా తీస్తామన్నారు. ఉప కులాలైన శ్రీశయన, సొండి కులస్తులకు శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి కేటాయించిన రెండు బార్లకు లైసెన్సు ఫీజు రూ.27.50 లక్షలు కట్టాలని, దరఖాస్తు ఫీజు రూ. 5 లక్షలన్నారు. వీరికి దరఖాస్తు స్వీకరణ గడువు ఈనెల 29 అని, కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 30న లాటరీ తీస్తామన్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు జిల్లాలోని భాష్యం స్కూలు సమీప జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయానికి వచ్చి డీపీఈఓ ఆఫీస్ పేరిట చలానా కట్టాలన్నారు.

‘పెన్షన్ల తొలగింపునకు కూటమి కుట్ర’