
శ్రీకాకుళం
న్యూస్‌రీల్
ప్రకృతి సేద్యానికి సైప్రకృతి సేద్యానికి రైతులు సై అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధ్యమవుతాయి. –8లో
uuపలాసలో ఇలా..
పలాస: పలాస నియోజకవర్గంలోని మూడు మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. పలా సలో ప్రైవేటు దుకాణాల్లో రైతులకు అవసరమైన ఎరువులు లభించకపోవడంతో ఒడిశా ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. పలాసలో ప్రైవేటు దుకాణాల్లో రూ.270 ఉండగా ఒడిశా రాష్ట్రంలోని గారబందకు మోటారు బైకుల మీద వెళ్లి ఒక బస్తా యూరియాను అధిక రేటు ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని అల్లుకోల గ్రామానికి చెందిన రైతులు చెబుతున్నారు. వర్షాలు బాగా పడటంతో ఒకే సారి దమ్ములు కావడం, గతంలో వేసిన ఎదలకు కూడా ఎరువులు వేయాల్సి రావడంతో యూరియాతో పాటు డీఏపీ ఎరువు కూడా అవసరం ఉంది. ఈ రెండు రకాల ఎరువులు ఎక్కడా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలు గ్రామాల్లో నామమాత్రంగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం