ఎవర్‌గ్రీన్ కానుక
ఆనందంగా ఉంది..
● పుట్టిన రోజుకో మొక్క నాటుతున్న విద్యార్థులు ● అవలంగిలో బర్త్ డే గార్డెన్ ● 216 మొక్కలు నాటిన విద్యార్థులు
హిరమండలం: అవలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకుపచ్చని జ్ఞాపకాలు పోగే సుకుంటున్నారు. పుట్టిన రోజు కానుక బతుకంతా కనిపించేలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. స్కూల్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకునే సందర్భాల్లో కేక్‌లు కట్ చేయకుండా ఆ పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటుతున్నారు. వాటి సంరక్షణకు శపథం చేస్తున్నారు. ఏడాది పొడవునా వాటి ఆలనాపాలనా చూస్తారు. ఇప్పటివరకూ 216 మొక్కలు నాటారు. నిత్యం వాటి సంరక్షణ చూస్తున్నారు. దీంతో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ గ్రీన్ స్కూల్ ప్రొగ్రామ్ కింద అవలంగి పాఠశాలను గుర్తించి అభినందనలు తెలిపింది.
సైన్స్ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో..
పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు డొక్కరి ధనుంజయ ఈ మొక్కల పెంపకం అనే యజ్ఞాన్ని ప్రారంభించారు. 2021 జనవరి నెలలో పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించిన ధనుంజయరావు వినూత్న ఆలోచన చేశారు. ఇక నుంచి విద్యార్థుల పుట్టిన రోజుల నాడు మొక్క లు నాటి సంరక్షించాలని తీర్మానం చేశా రు. అప్పటి నుంచి మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు.
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ గుర్తించడం ఆనందంగా ఉంది. మొక్క అనేది జీవకోటికి మూలం. చెట్లు వాతావరణ సమతుల్యతకు, మనిషికి ఆక్సిజన్లు ఇస్తాయి. అందుకే విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి మొక్కల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
– డొక్కర ధనుంజయ, సైన్స్ ఉపాధ్యాయుడు
ఎవర్‌గ్రీన్ కానుక


