
అనుమతులు ఆన్‌లైన్‌లోనే..
శ్రీకాకుళం క్రైమ్ : గణనాథుని ఉత్సవాల్లో భాగంగా మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పోలీ స్ శాఖ ప్రత్యేకంగా హెచ్‌టీటీపీఎస్:జిఎఎన్‌ఈస్‌హెచ్‌యుటిఎస్‌ఎవి.ఎన్‌ఇటీ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అన్ని రకాల అనుమతులు ఒకేసారి పొందేలా ఉండే ఈ విధానంలో ప్రజలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
●కమిటీ సభ్యులు ఆధార్, చిరునామాలు, ఫోన్ నంబర్లు, విగ్రహాల ఎత్తు, బరువు, పూజా దినాల సంఖ్య, వినాయక ఊరేగింపు, నిమజ్జన సమయా లు, రూట్‌మ్యాప్ వివరాలు తెలపాలి.
●నిర్వాహకులు మండపాలు ఉండే ప్రదేశం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
●నిర్దేశించిన ప్రాంతం, సమయాల్లో మాత్రమే విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం చేయాలి. రాత్రి 10 లోపు ముగించాలి.
●మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే
లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. స్పీకర్లను ఉద యం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే వినియోగించాలి. ●విగ్రహాలకు భద్రతగా కమిటీ సభ్యులు రాత్రిళ్లు మండపాల వద్దనే ఉండాలి.
●మండపాల వద్ద గానీ, ఊరేగింపులో గానీ బాణాసంచా వినియోగించరాదు.
●నిమజ్జన సమయంలో అశ్లీల నృత్యాలు గానీ డీజే శబ్దాలు గానీ ఉండరాదు.
●బలవంతపు చందాలు, వసూళ్లు, దర్శనాల టికెట్లు పెట్టరాదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫిర్యాదు చేయడానికి డయల్ 100కు ఫోన్ గానీ 6309990933 నంబర్‌కు వాట్సాప్ చేయాలి.