రేపు మహిళా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: గత కొన్నాళ్లగా శిక్షణ పొందుతున్న మహిళా సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణిలకు శుభవార్త. జిల్లా సీనియర్స్ మహిళల సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24న శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వేదికగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపికల ప్రక్రియను చేపట్టనున్నామని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు తెలిపారు ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపికచేసి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తామని, శిక్షణా శిబిరాల్లో రాణించిన క్రీడాకారులను జిల్లా తుది జట్లకు ఎంపిక చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని లయోలా ఇంజనీరింగ్ కళాశాల వేదికగా ఆగస్ట్ 30, 31 తేదీల్లో ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2025 పోటీ లు జరగనున్నాయని, జిల్లా నుంచి ఎంపికచేసిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు పంపిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలు కేఆర్ స్టేడియంలో సాఫ్ట్‌బాల్ సంఘ కార్యనిర్వహక కార్యదర్శి ఎంవీ రమణకు రిపోర్ట్ చేయాలని, పూర్తి వివరాలకు 94410 11391 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


