శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Aug 18 2025 5:51 AM | Updated on Aug 18 2025 5:51 AM

శ్రీక

శ్రీకాకుళం

నరక ప్రాయంగా..శ్రీకాకుళం ట్రాఫిక్‌ నరక ప్రాయంగా మారుతోంది. పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. –8లో ●దీపాల గోపాలుడు సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025 నేడు అన్ని పాఠశాలలకు సెలవు 19, 20 తేదీల్లో జోనల్‌ స్థాయి క్రీడాపోటీలు నేటి నుంచి ఇంటర్‌ రెండో యూనిట్‌ పరీక్షలు ● జిల్లా కేంద్రంలో వెలుగు చూస్తున్న కొత్త నేరాలు ● నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాలు ● పోలీసులకు సవాల్‌గా మారిన వైనం తయారీ ఇక్కడేనా.. బయట నుంచా..? విచారణలో విస్తుపోయేలా.. సాగునీరు ఇవ్వరు..

న్యూస్‌రీల్‌

నరక ప్రాయంగా..శ్రీకాకుళం ట్రాఫిక్‌ నరక ప్రాయంగా మారుతోంది. పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. –8లో
ఎండనక, వాననక కష్టపడే ఓ రోజు కూలీకి సాయంత్రం కూలి డబ్బుగా దొంగనోట్లు చేతిలో పడితే..? పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికుడి కష్టానికి నకిలీ నోట్లు వేతనం రూపంలో అందితే..? చదువు రాని కష్టజీవికి ఈ అబద్ధపు సొమ్మును అంటగడితే.. వారి బతుకు మరింత దుర్భరమవుతుంది కదా.. జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు కొత్త తరహా నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఒక తరహా నేరాన్ని అరికట్టామని అనుకునేలోపే మరో పద్ధతిలో దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా నకిలీ నోట్లు ముద్రించి చెలామణీకి తీసుకురావడం విస్మయపరిచింది. పెరుగుతున్న ఈ నేర సంస్కృతి పోలీసులకు సవాల్‌గా మారింది.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్ట ర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు అన్ని యాజమా న్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవే ట్‌ పాఠశాలల యాజమాన్యాలకు సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జోనల్‌స్థాయి క్రీడా పోటీలు ఈనెల 19,20 తేదీల్లో జరగనున్నాయని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు తెలిపారు. విశాఖపట్నంలో జరిగే ఈ పోటీల్లో ఇప్పటికే ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాకారులు/జట్లను బాలబాలికల రెండు విభాగాల్లోను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలను నిర్వహించి, ఎంపికై న బాలబాలికల జాబితాను వెల్లడించారు. జోనల్‌స్థాయి విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని అన్నారు. జిల్లా నుంచి రెండు విడతలుగా విశాఖపట్నం పయనమవుతారని, 19వ తేదీన ఉదయం 5 గంటలకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు తమ లగేజీతో చేరుకోవాలని పేర్కొన్నారు. ఆర్చరీకి ఎల్‌.రాజశేఖర్‌, అథ్లెటిక్స్‌కు జి.శ్రీనివాసరావు, రాజేష్‌, బాస్కెట్‌బాల్‌కు జి.అర్జున్‌రావురెడ్డి, పీఎస్‌ మణికుమార్‌, కబడ్డీకి ఎస్‌.సింహాచలం, పి. ఝాన్సీ, వాలీబాల్‌కు కె.హరికృష్ణ, మేనకాబిశ్వాల్‌ కోచ్‌, మేనేజర్లుగా వ్యవహరిస్తారని డీఎస్‌డీఓ శ్రీధర్‌ చెప్పారు. మరిన్ని వివరాలకు సంబంధిత క్రీడా కోచ్‌లను లేదా వి.ఉపేంద్ర (సెల్‌: 9885096734)ను సంప్రదించాలని ఆయన సూచించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు సోమవారం నుంచి రెండో యూనిట్‌ పరీక్షలు మొదలుకానున్నాయి. అన్ని యాజమాన్య జూనియర్‌ కాలేజీల్లో యూనిట్‌ టెస్ట్‌ పరీక్షల క్వశ్చన్‌ పేపర్లను ఇంటర్‌బోర్డు అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య జూనియర్‌ కాలేజీల్లో అనగా ప్రభుత్వ, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్పేర్‌, గురుకులాలు, మోడల్‌ కాలేజీలు, కేజీబీవీలు, హైస్కూల్‌ ప్లస్‌ కాలేజీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం అందజేయనున్నారు. పరీక్షకు కొన్ని నిమిషాల వ్యవధిలో ప్రశ్న పత్రాన్ని ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ఈ పేపర్లను ప్రింటవుట్‌ తీసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలేజీల నిర్వాహకులు మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. గత సారి కూడా ఈ పద్ధతి వల్ల ఇబ్బందులు ఎదుర య్యాయి.

నకిలీ నోట్ల ముద్రణ ఎక్కడ జరుగుతుందనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జీలో దొంగనోట్ల ముఠా బస చేసినప్పటికీ ఇటు లా అండ్‌ఆర్డర్‌ పోలీసులకు గానీ, స్పెషల్‌బ్రాంచి పోలీసుల కు గానీ ఇంటిలిజెన్స్‌కుగానీ సమాచారం లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. పైడి భీమ వరం, పాతపట్నం చెక్‌పోస్టులు దాటి మరీ ఈ ముఠాలు జిల్లాకు వస్తుండడం కూడా అనుమానించాల్సిన విషయమే. ఓ పెద్ద స్థాయి వ్యక్తే ఈ ముఠాలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు వీరిపై దృష్టి సారించి ముఠా ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు.

నకిలీ నోట్ల చెలామణీ కేసు విచారణ చేస్తుండగానే పోలీసులు విస్తుపోయేలా కొన్ని అంశా లు వెలుగులోకి వచ్చాయి. లాడ్జిలో దొరికిన వారిలో ఒకరి ఇంటిలో జరిపిన సోదాల్లో రెవె న్యూ అధికారులకు సంబంధించిన నకిలీ ప త్రాలు, స్టాంపులు లభించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా పలు బ్యాంకుల్లో కమిషన్‌ పేరిట రుణాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఓ మీడి యా ప్రతినిధి కూడా వెనక ఉన్నట్లు భోగట్టా.

శ్రీకాకుళం క్రైమ్‌ :

జిల్లా కేంద్రం.. అందులో ఓ లాడ్జి.. ఆ లాడ్జిలో నకిలీ నోట్ల ముద్రణ, చెలామణీ.. దాదాపు 20 రోజులుగా ఓ ముఠా ఈ కార్యకలాపాల్లో తలమునకలై ఉంది. ఇన్ని రోజుల తర్వాత గానీ పోలీసులకు వీరి గురించి సమాచారం అందలేదు. మన నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. దొంగలు తెలివి మీరుతున్నారో, ఖాకీలు అలసత్వం వహిస్తున్నారో గానీ నేరాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో రూపం మార్చుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. ఈ ముఠా జిల్లాకు రావడం వెనుక ఓ అజ్ఞాత వ్యక్తి హస్తముందని.. వాటాల్లో తేడా వల్లనే వీరిలో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొసరు వ్యక్తులు పట్టుబడి అసలు వ్యక్తులు తప్పించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్దికాలంలోనే చిక్కుతున్న ముఠాలు..

●2023లో జూలైలో కాశీబుగ్గ కేంద్రంగా అంబటి సంతోష్‌ అనే రౌడీషీటర్‌ మరికొందరితో కలసి నరసన్నపేటకు చెందిన వ్యాపారిని రూ.50 లక్షలకు పైగా మోసం చేశాడు. రూ. 500 నోట్ల కట్టలు అందిస్తే అంతకు పదిశాతం రూ. 2 వేల నోట్ల కట్టలు అందిస్తానని మభ్యపెట్టాడు. ఇదే అంబటి సంతోష్‌ ఈ ఏడాది జూన్‌లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో మరికొందరితో కలిసి రూ. 2.5 కోట్ల డీల్‌ ఓ వ్యక్తితో కుదుర్చుకుని రూ. 1 కోటి గుంజేశాడు.

●2024లో డిసెంబరు 12న ఒకేరోజు మెళియాపు ట్టి మండలం పట్టుపురం, జి.సిగడాం మండలం పెనసాం గ్రామాల వద్ద పోలీసులకు రెండు ముఠా లు పట్టుబడ్డాయి. వీరి వద్ద నుంచి సుమారు రూ. 90.25 లక్షల వరకు నకిలీ కరెన్సీతో పాటు రూ. 1.50 లక్షల బ్లాక్‌ కరెన్సీ కలర్‌ప్రింట్‌ మిషన్లు, కెమికల్స్‌, కలర్‌ ఇంక్‌బాటిల్స్‌, బ్లేడ్‌, గమ్ముబాటిల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాశీబుగ్గనే అడ్డానా..?

ఈ ఘటనల్లో భాగంగా పట్టుబడిన నిందితులు ఎక్కువగా కాశీబుగ్గ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. పోలీసులు ఆ ప్రాంతంపై బాగా దృష్టి సారించడంతో ఇప్పుడా

ముఠాలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కొన్ని లాడ్జీలను అడ్డాగా ఎంచుకుంటున్నాయి.

దొంగ పేర్లతో లాడ్జీలు బుక్‌ చేయడం, ముఠాలను అడ్డదారుల్లో రప్పించడం, ఆపై నోట్ల చెలామణీ విషయం బయటకు పొక్కకుండా ఉండేందు కు కొంతమొత్తంలో డీల్‌ కుదర్చడం ఇక్కడి వ్యక్తు లు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనలో దాదా పు రూ.50 లక్షల పైన తమకు ఇవ్వాలని దొంగనోట్ల ముఠాను డిమాండ్‌ చేయడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులతో టచ్‌లో ఉన్నవారే సమాచారం అందించినట్లు భోగట్టా. ఈ తతంగమంతా 20 రోజులు సాగినట్లు చర్చ సాగుతోంది. మరికొందరు దొరక్కపోవడంతో ఇంకా బయట గ్యాంగు ఉందనే అనుమానాలు ఇక్కడి ప్రజల్లో నెలకొన్నాయి.

మా కాలువలు మేమే బాగుచేసుకుంటున్నాం. సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. నారుమడ్లు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడక్కడ నారు ఉన్నచో ట తీసుకొచ్చి ఉభాలు చేద్దామంటే నీరు లేదు. ఎన్నిసార్లు ఇంజినీర్లకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.

– లండ సీతారాం, కొండవూరు,

వజ్రపుకొత్తూరు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ):

రుణ దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వడం లేదన్న చందంలా.. జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ ఇంజినీర్ల నిర్లక్ష్యానికి శివారు ప్రాంతాల రైతులు బలైపోయారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకు చెందిన వారే అయినా ఆయన కేవలం తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గంలో వజ్రపుకొత్తూరు మండలంతో పాటు పలు గ్రా మాలకు సాగునీరు అందడం లేదని, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో ఉండే ప్రజాప్రతినిధులు శివారుకి సాగునీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గత సోమవారం నేరు గా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు లక్ష్యం 1.50 లక్షల హెక్టార్లు. దీనికి ప్రధాన నీటి వనరులు వంశధార కుడి, ఎడమ కాలువలు, తోటపల్లి కాలువలు. బీఆర్‌ఆర్‌ వంశధార సర్కిల్‌కు, ఇరిగేషన్‌ సర్కిల్‌కు రెగ్యులర్‌ ఎస్‌ఈలు లేరు. ఇన్‌చార్జిలు ఉండటం వల్ల ప్రాజెక్టుల పనులు, కాలువల్లో పూడికలు తీసే పనులు చేయకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పనులు చేయాల్సిన సమయంలో అంచ నాలు తయారు చేసి సరిగా ఇవ్వకపోవడంతో కాలు వలు దీనిస్థితిలో ఉండిపోయాయి. జిల్లాలో వంశధార కుడి కాలువ శివారు ప్రాంతాలైన శ్రీకాకుళం రూరల్‌, గార ప్రాంతాల్లో 10వేలు ఎకరాలు, ఎడమ కాలువకు శివారు ప్రాంతాలైన పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 30 వేల ఎకరాలున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో కొండవూ రు, కూర్మనాథపురం, పెద్దబొడ్డపాడు, బెండి, తేరపల్లి, రెయ్యపాడు, తుంబవానిపేట, గర్తంవాటిపేట గ్రామాల్లో రైతులు కాలువల్లో పూడికలు తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు చేరడంతో ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి తోడుకుంటున్నారు. తోటపల్లి నుంచి రణస్థలం, జి.సిగడాం, లావేరు ప్రాంతాల్లో 30 వేల ఎకరాలు శివారు

ప్రాంతాలుగా ఉన్నాయి. నేటికీ ఈ కాలువల్లోకి సాగునీరు రాకపోవడంతో రైతులు వర్షంపైనే ఆధారపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పడిన గండ్లు పూడ్చకపోవడంతో ఈ ఏడాది రైతుల పాలిట శాపంగా మారింది. ఇంజినీర్లు లేకుండా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు ఎలా పరుగులు పెట్టిస్తారో, సాగు నీరు ఎలా అందిస్తారో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే సమాధానం చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

గర్తంపాడు సమీపంలో రాయగుడ్డి కాలువలో పూడికలు తీసుకుంటున్న గ్రామస్తులు

శ్రీకాకుళం1
1/6

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/6

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/6

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/6

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/6

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/6

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement