
వాన సందేశం
మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
బోట్లకు నష్టం
మందస: గెడ్డవూరులో సముద్రంలోకి కొట్టుకుపోతున్న బోట్లు
జిల్లాలో శనివారం 398.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆదివారం నాటికి వర్షం మరింత ఎక్కువైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు 178.6 మిల్లీమీటర్ల వర్షం పడగా, ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 339.2 మిల్లీమీటర్లు కురిసింది. సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 517.8 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఎక్కువగా హిరమండలం, మందస, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, సోంపేట, గార, సరుబుజ్జిలి, నరసన్నపేట, పొలాకి, శ్రీకాకుళం, రణస్థలం మండలాల్లో కురిసింది.
హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం స్వల్పంగా వరద నీరు పెరిగింది. బ్యారేజీవద్ద 38.10మీటర్ల నీటిమట్టం ఉంది. బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 8577 క్యూసెక్కులు వస్తోంది. వచ్చిన నీటిని స్పిల్‌వే తోపాటు 9 గేట్లు 20సెంటీమీటర్లు పైకి ఎత్తి దిగువకు అవుట్‌ఫ్లో 8577 క్యూసెక్కులు విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి తెలిపారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1771 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 308 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు చెప్పారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు విస్తారంగా పడితే వరద పెరిగే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్ :
జిల్లాకు వాన సందేశం అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో రెండు రోజులపాటు జిల్లాలో భారీ, అతి భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం 19వ తేదీ ఉదయం నాటికి ఆంధ్రా–ఒడిశా మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలతో పాటు 40 నుంచి 60 కిలోమీటర్లు వరకు బలమైన ఈదురుగారులు వీస్తాయని తెలిపారు. సోమ, మంగళ, బుధవారా ల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉది.
కొనసాగుతున్న కంట్రోల్ రూమ్
వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్(08942 220557)ను కొనసాగించింది. కలెక్టరేట్ ఆర్డీవో కార్యాలయం మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు కొన సాగుతున్నాయి. నదుల తీరప్రాంతాల్లోనూ, సముద్ర తీర మండలాల్లోనూ మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉద్యోగులకు సెలవులు లేవు: కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవుట్‌స్టేషన్ సెలవులు మంజూరు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి చెరువుల నీటి మట్టాలను పర్యవేక్షించాలని, నదులు–కాలువల గట్లను బలోపేతం చేయాలని, నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచి, పునరావాస కేంద్రాలను శుభ్రపరిచి రె వెన్యూ శాఖకు అప్పగించాలని సూచించారు. తక్కు వ ఎత్తులో ఉన్న రహదారులు, వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించే కాజ్‌వేలు మూసివేయాలని రెవెన్యూ, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జా రీ చేయాలన్నారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫోన్‌లో ఆదేశించారు.
మందస: గెడ్డవూరు గ్రామం సమీపంలో ఉన్న సముద్ర తీరం కోతకు గురి కావడంతో
పడవలు సముద్రం లోపలకు వెళ్లిపోయాయి. మత్స్యకారులు స్పందించడంతో పడవలు, వలలను కాపాడుకున్నారు. కానీ బోట్లు కొంత మేర దెబ్బ తిన్నాయని వారు తెలిపారు.

వాన సందేశం

వాన సందేశం

వాన సందేశం