
‘కేజీబీవీ ప్రిన్సిపాళ్ల అక్రమ బదిలీలు నిలిపివేయాలి’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేజీబీవీల ప్రిన్సిపాళ్ల అక్ర మ బదిలీలు నిలిపివేయాలని, ఏపీసీని తొలగించా లని ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్, సీనియర్ నాయకులు కె.విజయగౌరి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి. శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రక టన విడుదల చేశారు. జిల్లాలోని పొందూరు, కంచిలి, గార కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్స్‌పై ఎలాంటి విచారణ జరపకుండా, కేవలం స్థానిక ఎమ్మెల్యే ల లేఖల ఆధారంగా బదిలీ చేయడం అన్యాయమన్నా రు. స్థానిక ఎమ్మెల్యేల లేఖల ఆధారంగా విచారణ లేకుండా బదిలీలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రిన్సిపాల్స్ బదిలీకి రాష్ట్ర కార్యాలయం అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఉల్లంఘించారని, బదిలీకి ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ అని చూ పించడం వాస్తవాలను దాచే ప్రయత్నమని తీవ్రంగా విమర్శించారు. అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.