
శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య.. బలవనర్మణానికి ప్రయత్నించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
‘‘టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా. గత మూడు రోజులుగా నన్ను, నా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆస్పత్రి బెడ్ మీద కన్నీళ్లు పెట్టున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఆమెపై నెగెటివ్‌గా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు వాళ్ల సంబంధిత అకౌంట్లలో ఆ పోస్టులు చేయిస్తున్నారని ఆమె అంటోంది.
ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి. మూడు రోజుల నుంచి బాధితురాలు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య మీడియా ముఖంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని కూడా ఆమె అన్నారు.
ఎమ్యెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. నావల్ల కావడం లేదంటూ.. మీటింగుల పేరుతో రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు కన్నీరుపెట్టుకుంది. ఉన్నతాధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు తనపై అవినీతి ఆరోపణలు చేసి ఇచ్చాపురం ట్రాన్స్‌ఫర్ చేశారని మండిపడిందామే. ఇదే విషయంపై SC కమిషన్‌కు కూడా ఆమె ఫిర్యాదు చేశారు.
అయితే ఎమ్మెల్యే రవి ఆ ఆరోపణలను ఖండించారు. ఆమెపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. సౌమ్యపై టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయగా.. తీవ్ర మనస్థాపంతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది.
