బాలికపై అఘాయిత్యం | - | Sakshi
Sakshi News home page

బాలికపై అఘాయిత్యం

Apr 30 2025 5:13 AM | Updated on Apr 30 2025 5:13 AM

బాలికపై  అఘాయిత్యం

బాలికపై అఘాయిత్యం

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం వేరే నగరంలో నివసిస్తున్న బాలిక సెలవుల్లో శ్రీకాకుళంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలికకు తండ్రి లేరు. ఈ నెల 28న ఆ బాలిక ఎదురింటిలో ఉన్న 26 ఏళ్ల యువకుడు ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన మేనత్త వద్ద బాలిక ఈ విషయాన్ని చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా తొమ్మిదిరోజులు రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ హరికృష్ణ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement