సత్యనారాయణ నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

సత్యనారాయణ నేత్రదానం

Apr 21 2025 12:49 AM | Updated on Apr 21 2025 12:49 AM

సత్యన

సత్యనారాయణ నేత్రదానం

శ్రీకాకుళం కల్చరల్‌: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్‌వీ మొహెర్‌ సుధాకర్‌, ఎన్‌వీ సురేష్‌, ఎన్‌వీ రవికిషోర్‌, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్‌ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్‌ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్‌లను అభినందించారు.

ఆదిత్యునికి విశేష పూజలు

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వా మికి ఆదివారం విశేష పూజలు, అర్చనలు జరిగాయి. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వాతావరణంలో మార్పులు, తీవ్ర ఎండలు, ఉక్కబోతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆలయం తరఫున ఈవో వై.భద్రాజీ భక్తుల కో సం టెంట్లు, పాదాలకు రక్షణగా ఎర్రతివాచీలు వేయించడంతో కొంతమేరకు ఉపశమనం కలిగింది. విజయనగరం పార్లమెంట్‌ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు తొలిసారిగా కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నదాన పథకంలో భాగంగా భక్తులు అన్నదానం స్వీకరించారు. అయితే రుచి, శుభ్రత విషయంలో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.2,66, 700, విరాళాలు, ప్రత్యేక ఆర్జిత సేవల ద్వారా రూ.70,548, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.40 లక్షలు వరకు ఆదాయం లభించినట్లుగా ఈవో భద్రాజీ తెలిపారు.

ఎరక్కపోయి ఇరుక్కుని..

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేటీ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు పక్కపక్కన వెళ్తున్న సమయంలో ఓ ఆటో వాటి మధ్య నుంచి వెళ్లి ఇరుక్కుపోయింది. డ్రైవర్‌ తప్ప ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాశీబుగ్గలో ఆటోలు బస్టాండ్‌లో ప్రవేశించి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు.

సత్యనారాయణ నేత్రదానం 1
1/2

సత్యనారాయణ నేత్రదానం

సత్యనారాయణ నేత్రదానం 2
2/2

సత్యనారాయణ నేత్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement