పార్టీ పటిష్టతకు కృషిచేద్దాం
● మాజీ స్పీకర్, పార్టీ పీఏసీ మెంబర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ పీఏసీ మెంబర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఆయనను పీఏసీ మెంబర్‌గా పార్టీ అధిష్టానం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సందర్భంగా.. ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో గురువారం తమ్మినేనికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కాళింగ కుల అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావుతో పాటు సరుబుజ్జలి, పొందూరు మండల నాయకులు సత్కరించారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేయాలని త మ్మినేని వారికి సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తాను జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, సరుబుజ్జలి, పొందూరు మండలాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


