
పద్మావతి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణంలోని ప్రకాష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎల్.పద్మావతి (97) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జెమ్స్ ఆస్పత్రిలో అవయవ దానం చేశారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో రెడ్‌క్రాస్ ప్రతినిధులు ఐ టెక్నీషియన్ సుజాత, ఉమాశంకర్‌ఽలు ఆమె నేత్రాలను సేకరించారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆమె కార్నియాలను సేకరించి విశాఖ, ఎల్‌వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందించారు. నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు అభినందించారు. ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే 7842699321 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని కోరారు.
‘నిబంధనలు పాటించాలి’
సోంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు విద్యాశాఖ, ప్రభుత్వ నిబంధనలు పా టించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో పాఠశాలల మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వంటలో చేపట్టాల్సిన మెలకువలు, నియమ నిబంధనలు శిక్షకురాలు యు.లక్ష్మి తెలియజేశారు. శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖాధికారి పరిశీలించి సలహాలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు ఎస్.జొరాడు, జె.కృష్ణం రాజు, విద్యావనరుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పద్మావతి నేత్రాలు సజీవం