శ్రీకాకుళం న్యూకాలనీ: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గత నెల ఆరో తేదీన శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ప్రజ్ఞా వికాస పరీక్షలో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అధ్యయనం–పోరాటం అనే నినాదాలతో దేశవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొదటి స్థానంలో ఎస్.యశాశ్విని (శ్రీ చైతన్య స్కూల్), రెండవ స్థానంలో డీవీఎం సుదీర్ (ఎన్టీఆర్ ఎంహెచ్‌స్కూల్), 3వ స్థానంలో బి.ప్రియవర్శిని (సిద్ధార్థ స్కూల్) నిలిచారు.
వీరికి ఆయా పాఠశాలల హెచ్‌ఎంల ద్వారా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, వాసు పాల్గొన్నారు.


