ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్‌ మల్లికార్జున | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్‌ మల్లికార్జున

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

హిందూపురం టౌన్‌: ముంబైలో నిర్వహిస్తున్న 3వ ‘ప్రపంచ మేయర్ల సదస్సు–2026’లో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున పాల్గొన్నారు. స్థానిక స్వపరిపాలనపై పనిచేస్తున్న అఖిల భారత సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు ముంబైలోని ఫెయిర్‌మాంట్‌ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. పట్టణ పరిపాలన, అభివృద్ధి, మెరుగైన పాలనపై దేశ, విదేశాల ప్రతినిధులు చర్చించనున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ నామినేట్‌ కాగా, బుధవారం ఆయన సదస్సులో పాల్గొన్నారు. పట్టణ స్థానిక సంస్థల పరిపాలనలో ఎదురవుతున్న సవాళ్లు, పట్టణాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు, పాలనా సామర్థ్యాన్ని పెంపొందించే మార్గాలపై సదస్సులో చర్చలు జరగనున్నాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి

సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు

అనంతపురం : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు ముగిశాయి. అనంతపురంలోని రామ్‌నగర్‌లోని లక్ష్మీనరసింహ టెన్నిస్‌ అకాడమీలో ఈ నెల 23 నుంచి అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 విభాగాల బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు రోజైన బుధవారం విజేత, రన్నరప్‌ జట్లకు మెమొంటోలు అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు డిసెంబర్‌ 5 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ముగింపు వేడుకలకు డీఈఓ అయ్యూబ్‌ హుస్సేన్‌, ఉప విద్యాశాఖాధికారులు శ్రీనివాసరావు, లక్ష్మణ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాఫ్ట్‌ టెన్నిస్‌ కోఆర్డినేటర్‌ బాబు, అబ్జర్వర్‌ చందానాయక్‌, జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు సత్యనారాయణ, రాధమ్మ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సిరాజుద్దీన్‌, ఏపీ పీఈటీ– ఎస్‌ఏ పీఈ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు, నిర్వాహకులు నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement