హిందూపురం టౌన్: తన మాటకే ఎదురుచెబుతారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి ఇద్దరు యువకులతో పాటు వారి సోదరిపై కొడవలితో దాడి చేశాడు. బుధవారం రాత్రి స్థానిక త్యాగరాజనగర్‌లో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. త్యాగరాజ్‌నగర్‌కు చెందిన ఎరికల పవన్, ఎరికల మహేష్ బుధవారం రాత్రి త్యాగరాజ్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అదే ప్రాంతానికి చెందిన విష్ణు గేమ్ ఆడుతున్న వారిని మందలించాడు. ‘‘ఇక్కడ ఎందుకున్నారు... వెళ్లిపోండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సదరు యువకులు తామేం చేశామంటూ ప్రశ్నించగా.. వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన విష్ణు కోపంతో అక్కడినుంచి వెళ్లి కొడవలి తీసుకువచ్చి పవన్, మహేష్‌లపై దాడి చేశాడు. ఈ దాడిలో వారిద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్, మహేష్ సోదరి ఐశ్వర్య, బంధువులు అక్కడి చేరుకుని విష్ణును ప్రశ్నించగా...అప్పటికే కోపంతో ఉన్న అతను కొడవలితో ఆమైపె కూడా దాడి చేసి గాయపరిచాడు. దీంతో బంధువులు పవన్, మహేష్‌తో పాటు వారి సోదరి ఐశ్వర్యను హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో విష్ణు ముఖానికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై హిందూపురం వన్‌టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.


