పరిగి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం. మంజుల హ్యాండ్బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించగా, జిల్లా జట్టు తరఫున పాల్గొన్న మంజుల తన ప్రతిభతో సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో వారు ఆమెను త్వరలో గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు కృపాసత్యరాజు తెలిపారు. క్రీడల్లో రాణిస్తూ పాఠశాలకు పేరు తెస్తున్న మంజులను బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. కార్యక్రమంలో పీడీ వినోద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు పరిగి విద్యార్థిని


