ఆధ్యాత్మికధామం..సాయి నామం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికధామం..సాయి నామం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామంగా పేరుగాంచిన ప్రశాంతి నిలయంలో సత్యసాయి శత వర్ష జయంత్యుత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం సాయికుల్వంత్‌ సభా మందిరంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సినీనటి రష్మికతో పాటు కర్ణాటక రాష్ట్ర మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వందితా శర్మ పాల్గొన్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులు బ్రాస్‌ బ్యాండ్‌, బ్యాండ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సత్యసాయి నామంతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనించింది. అనంతరం వక్తలు..సత్యసాయి మహిళాలోకానికి చేసిన సేవలను కొనియాడారు. సత్యసాయి జీవిత ఘట్టాన్ని చాటుతూ సత్యసాయి హైయ్యర్‌ సెకెండరీ స్కూల్‌, ఈశ్వరమ్మ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు ఆధ్యాత్మిక భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అకట్టుకున్నారు. సాయంత్రం వియన్నా క్లాసికల్‌ ఎసెంబ్లీ బృందం నిర్వహించిన పాశ్యాత్య క్లాసిక్‌ సంగీత కచేరీ భక్తులను మురిపించింది.

ప్రశాంతి నిలయంలో

ఘనంగా మహిళా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement