పుట్టపర్తి టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఢిల్లీ ఆక్రమణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ తలపెట్టిన జీపుజాతాను ప్రశాంతి గ్రామంలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.42 వేలు జీతం చెల్లించాలన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాన్నారు. ఢిల్లీ ఆక్రమణ కార్యక్రమానికి కార్మికులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యరద్శి జి.ఎల్ నరసింహులు, జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పైపల్లి నరసింహులు, గంగాధర్, సాంబశివ, ముత్యాలు గౌస్‌లాజమ్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.


