వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ మూకల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ మూకల దాడి

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

కనగానపల్లి: బద్దలాపురం గ్రామంలో బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ మూకలు దాడి చేశారు. ఈ దాడిలో స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యకర్త జింకల గంగన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జింకల గంగన్న, తలారి రమణతో మరో ఇద్దరు జీపులో పక్క గ్రామానికి వెళ్లి వస్తున్నారు. ఈ సందర్భంలో గ్రామ పొలిమేరలో ఉన్న స్థానిక టీడీపీ కార్యకర్తలు దాసరి రామాంజి, నాగార్జున, మంజు జీపును ఆపి వారితో గొడవ పెట్టుకొని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గంగన్న తలకు, ముఖంపై తీవ్ర గాయాలు కాగా, రమణతో పాటు మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానిక నాయకులు వెంటనే అక్కడికి వెళ్లి దాడిలో తీవ్రంగా గాయపడిన గంగన్నను మొదట ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు అనంతపురం తరలించారు. రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ మూకలు తరుచూ మా పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు నరసింహులు, సురేష్‌, దినేష్‌రెడ్డి, ముత్యాలు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement