మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

బెళుగుప్ప: యలగలవంక, బ్రాహ్మణపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో ఓ మహిళ దారుణహ్యతకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల మాలక్క(40)ను 20 ఏళ్ల క్రితం యలగలవంక గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. భార్యాభర్తలు శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి వలస వెళ్లి కొన్నేళ్ల పాటు వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగించారు. అయితే భర్తతో విభేదాలు రావడంతో ఆమె 8 ఏళ్ల క్రితం యలగలవంక గ్రామానికి వచ్చి తన సోదరి ఇంటి సమీపంలోని మరో ఇంటిలో నివసిస్తోంది. ఈక్రమంలో తన సోదరి భర్త గొల్ల గోవిందుతో సన్నిహితంగా మెలిగేది. కొన్ని రోజుల క్రితం మాలక్క, గోవిందు మధ్య ఆర్థికలావాదేవీల్లో గొడవ చోటు చేసుకుంది. ఈక్రమంలో బుధవారం ఆమె బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో దారుణహత్యకు గురైంది. తలపై బండరాయితో మోది హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గొల్ల గోవిందే హత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ పేర్కొన్నారు.

జనవరిలో జేఎన్‌టీయూఏ

16వ స్నాతకోత్సవం

అనంతపురం : జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్టీయూ–ఏ) 16వ స్నాతకోత్సవం 2027 జనవరిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కాన్వొకేషన్‌ డిగ్రీ కోసం ఆన్‌లైన్‌ [ https:// jntuaebranchpayment. in/ originaldegree]( https:// jntuaebranchpayment. in/ originaldegree) లో వచ్చే నెల (డిసెంబర్‌) 21లోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌ సూచించారు. స్నాతకోత్సవ వేదికపై కేవలం పీహెచ్‌డీ అవార్డు గ్రహీతలు, గోల్డ్‌ మెడల్‌ విజేతలకు మాత్రమే నేరుగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. మిగిలిన అభ్యర్థులందరికీ రిజిస్టర్డ్‌ పోస్ట్‌, కొరియర్‌ ద్వారా వారి ఒరిజినల్‌ డిగ్రీలను పంపనున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www. jntua. ac. in లోని ఎగ్జామినేషన్‌ విభాగాన్ని సందర్శించాలని రిజిస్ట్రార్‌ కోరారు.

మాజీ మహిళా వలంటీర్‌పై టీడీపీ నేత అనుచరుల దాడి

చిలమత్తూరు: మండల కేంద్రానికి చెందిన ఓ మహిళా వలంటీర్‌పై చిలమత్తూరు పంచాయతీ టీడీపీ ముఖ్యనేత అనుచరులు అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న సదరు మహిళపై తాగి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఆమె వెంబడించి ఇంటి వద్ద సైతం గొడవకు దిగినట్టు తెలిసింది. ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మహిళ తెలిపారు. చిలమత్తూరులో ఒంటరిగా వెళ్లే మహిళలను రాత్రి సమయాల్లో మద్యం సేవించి అధికారం మదంతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నోటిఫికేషన్‌ విడుదల

డిసెంబర్‌ 21లోపు దరఖాస్తులకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement