బత్తలపల్లి: ‘‘అధికారం ఉందన్న అహకారంతో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేస్తూ ఏదో సాధించామని సంబరపడుతున్నారు. కానీ రానున్న రోజుల్లో వారికి వడ్డీతో కలిపి ఇస్తాం’’ అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గురువారం పరిషత్ పోలింగ్ సందర్భంగా టీడీపీ గుండాలు వెంకటగారిపల్లి గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోకి దూరి మిడతల నారాయణస్వామి, వడ్డ్డే కృష్ణయ్య, దివ్యాంగుడైన రామాంజనేయులు, మూగ చిన్నారి అశోక్, గణేష్‌లను, సెల్‌ఫోన్‌లో ఘటనను చిత్రీకరిస్తున్న అమ్మాయిపైన దాడులు చేశారన్నారు. వీరిలో మిడతల నారాయణస్వామి, వడ్డే కృష్ణయ్య అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... ఓటు వేసుకునే హక్కును కూడా టీడీపీ గూండాలు హరిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దాడులు, దౌర్జన్యాలకు స్వస్తి చెప్పాలన్నారు. లేదు ఇలాగే అకారణంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తామంటే... చూస్తూ ఊరుకోబోమన్నారు. ఓటు వేసి ఇంట్లో ఉన్న వారిపై టీడీపీ గూండాలు దాడి చేయడంతో పాటు తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారంటే ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రజలు గమనించాలన్నారు. దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. మాల్యవంతం పంచాయతీలో టీడీపీ గూండాలు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారన్నారు. భవిష్యత్తులో వీరు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఓటమి భయంతో దాడులకు పాల్పడుతున్నారని, రిగ్గింగులు, సైక్లింగ్ ద్వారా దొంగ ఓట్లు వేసుకొంటూ అడ్డుపడుతున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. కేతిరెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కమతం ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి సురేష్‌కుమార్, మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, నాయకులు చల్లా కృష్ణమనాయుడు, ఎం.చెర్లోపల్లి ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, అరవిందరెడ్డి, వెంకటగారిపల్లి శ్రీనివాసులు, ఆదెప్ప, వెంకటరాముడు, రామాంజనేయులు, చంటి, నాగరాజు తదితరులు ఉన్నారు.
టీడీపీ గూండాలకు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరిక
గాయపడిన వైఎస్సార్‌సీపీ
నాయకులకు పరామర్శ


