కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

పుట్టపర్తి అర్బన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు కౌంటింగ్‌ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు నియమించిన సిబ్బందికి శుక్రవారం కొత్తచెరువులోని బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు. హాజరైన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అధికారులు, సిబ్బంది ఈసీ మార్గదర్శకాల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. కౌంటింగ్‌లో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ సువర్ణ ఉన్నారు.

పటిష్ట బందోబస్తు

పుట్టపర్తి టౌన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్‌ విధుల్లో 2,000 మంది పోలీసులు ఉంటారన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌ యాక్ట్‌ 30, బీఎన్‌ఎస్‌ 163 పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశామని, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి పంపుతామని పేర్కొన్నారు. కౌంటింగ్‌ హాల్లోకి మొబైల్‌ ఫోన్లు, పెన్నులు, పేపర్లు తదితర వస్తువులేవీ అనుమతించబోమన్నారు. స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ హాళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఫలితాల అనంతరం ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement