సత్యసాయి శత జయంత్యుత్సవాలకు విచ్చేయండి | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి శత జయంత్యుత్సవాలకు విచ్చేయండి

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంత్యుత్సవాలు ఈనెల 23న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఏర్పాట్లలో నిమగ్నమైంది. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు శుక్రవారం విజయవాడలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబును వేర్వేరుగా కలిసి సత్యసాయి శత జయంతి వేడుకలకు ఆహ్వానించారు. ఇందుకు వారిద్దరూ సముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 22వ తేదీ ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయి విద్యాసంస్థల 45వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, 23న నిర్వహించనున్న సత్యసాయి శత జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ వెల్లడించింది.

గవర్నర్‌, ముఖ్యమంత్రిని

ఆహ్వానించిన ఆర్‌జే రత్నాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement