ముగిసిన ‘పరిషత్‌’ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పరిషత్‌’ ప్రచారం

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

● జెడ్పీటీసీ బరిలో 234 మంది, ఎంపీటీసీ బరిలో 1,949 మంది

పుట్టపర్తి/పుట్టపర్తి అర్బన్‌: పరిషత్‌ ఎన్నికల్లో ప్రచారం ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. వారం రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం హోరెత్తించారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కావాలంటే ఫ్యాన్‌ గుర్తు ఓటేయాలని కోరారు. ఇక బహిరంగ ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 5న జరగనున్న పోలింగ్‌ కోసం దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను స్వగ్రామాలకు పిలిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం బెంగళూరు, హైదరాబాద్‌ తదితర పట్టణాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేక బస్సులు పంపి రప్పిస్తున్నారు. జిల్లాలోని 32 జెడ్పీటీసీ స్థానాల నుంచి 234 మంది, 397 ఎంపీటీసీ స్థానాల నుంచి 1,949 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement