ఎన్నికల ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తలుపుల మండలంలోని ఈదులకుంట్లపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దేవేంద్రనాయక్‌ ఈదులకుంట్లపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గోవిందునాయక్‌కు మద్దతుగా రాజనాలవాండ్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన కూడదని నిబంధనలున్నాయి. అయినా గోవిందునాయక్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై విమర్శలొస్తున్నాయి.

ప్రజలు నిలదీయడంతో దిగొచ్చిన బాబు ప్రభుత్వం

● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు

● సమ్మె విరమించిన

సత్యసాయి కార్మికులు

కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం సమ్మె విరమించి విఽధుల్లోకి చేరారు. కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఉన్న సత్యసాయి ప్రాజెక్ట్‌లో ప్రధాన పైపులైన్‌ మోటర్లు ఆన్‌ చేసి గ్రామాలకు తాగునీటి సరఫరాకు కార్మికులు చర్యలు చేపట్టారు. సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 4 నెలల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజలు తాగునీటి సమస్యపై కూటమి నేతలను నిలదీయడంతో ప్రభుత్వం దిగి వచ్చి ప్రాజెక్ట్‌ బీఆర్‌ఓ అకౌంట్‌లోకి రూ.18 కోట్లు జమ చేసిందన్నారు. ఈ నగదు 6 నెలల వేతనాలకు మాత్రమే సరిపోతుందన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను, కార్మికుల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కార్మికులకు ప్రతి నెల 5న వేతనాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే మళ్లీ కార్మికులు సమ్మెబాట పడతారని హెచ్చరించారు.

టీడీపీకి మద్దతివ్వలేదని

ఇంటిని కూల్చేశారు

కుందుర్పి: ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని టీడీపీ నాయకులు చక్రానాయక్‌, గోపాల్‌నాయక్‌, రాజూనాయక్‌ కక్షకట్టి తన ఇంటిని రెండు రోజుల క్రితం కూల్చేశారని ఎస్‌.మల్లాపురం తండాకు చెందిన సుజాతాబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే పోలీసులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సంఘటన స్థలానికి కూడా రాలేదని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని ఆదేశాల మేరకే పోలీసులు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు బుజ్జీనాయక్‌, కృష్ణానాయక్‌, నరశింహులు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటక మద్యం స్వాధీనం

విడపనకల్లు: ఉరవకొండ ఎకై ్సజ్‌ పోలీసు సిబ్బంది శుక్రవారం మండల కేంద్రంలోని కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విడపనకల్లు గ్రామానికి చెందిన గునక రామాంజనేయులు అనే వ్యక్తి నుంచి 25 హైవార్‌ుడ్స, చీర్స్‌ విస్కీ, టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉరవకొండ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిచంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement