ధర్మవరం: పట్టణంలో పీఆర్టీవీధిలో విషాదం చోటుచేసుకుంది. 23వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి సింహం రామంజినేయులు సతీమణి సింహం అనసూయమ్మ (48) గుండెపోటుతో మృతిచెందింది. ఎన్నికల ప్రచారంలో గురువారం సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి రామంజినేయులు ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించారు.
కౌన్సిలర్ అభ్యర్థి సతీమణి
గుండెపోటుతో మృతి


