పుట్టపర్తి టౌన్: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణతో పాటు జర్నలిస్టులు కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కోరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు రూరల్ సాక్షి విలేకరి సుబ్బారెడ్డిపై దుండగులు జరిపిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. శివరామకృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు జరిగిన ప్రతిసారి నిరసనలు వ్యక్తం చేయడం వినతిపత్రాలు అందించడం మినహా శాఽశ్వత పరిష్కారం చూపలేదన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సాక్షి ప్రతినిధి దివిటి రాజేష్, జర్నలిస్టులు కేశవరెడ్డి, సాయికృష్ణారెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, అంజిప్రసాద్, నాగరాజు, గోపాల్, శ్రీనివాసులు, సతీష్‌బాబు, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.


