సాక్షి, పుట్టపర్తి
‘‘మాట తప్పం... మడమ తిప్పం’’ మా పార్టీ విధానమిది... హామీ ఇస్తే నెరవేర్చితీరుతామంటూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ వీధికి వెళ్లినా.. జగనే రావాలి అంటూ కదం తొక్కుతున్నారు. ఇక మూడు పార్టీల కండువాలతో ప్రచారాలకు వెళ్తున్న కూటమి నాయకులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం..రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారని ప్రజలు నిలదీస్తుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
స్పందన కరువు..
‘సంక్షేమ పథకాలన్నీ మీరే తీసుకున్నారు..అర్హులమైనా మాకు ఇవ్వకుండా వేధించారు..ఇప్పుడు మా ఓట్లు అడిగేందుకు మీకు ముఖం ఎలా వచ్చింది’ అంటూ జనం నిలదీస్తుండగా...మున్సిపల్ ఎన్నిక ల ప్రచారానికి కూటమి ముఖ్యనేతలు వెనుకంజ వేస్తున్నారు. అందుకే ప్రచారంలో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. కూటమి అభ్యర్థుల వెంట పట్టుమని పది మంది కూడా ఉండటం లేదు. దీంతో ఎలాగైనా సరే.. ఎన్నికల్లో నెగ్గాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు పలు విధాలుగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. పదవులు, డబ్బు ఎరవేస్తున్నారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున బరిలో దిగిన బోయ అవినాష్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. స్థానికుడు, విద్యావంతుడు, చురుకై న వ్యక్తిగా జనాల్లోకి దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందాడు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తుండగా...ప్రజల నుంచి ఆయనకు ప్రతి వార్డులోనూ భారీగా మద్దతు లభిస్తోంది. మరోవైపు కూటమి తరఫున జనసేన నుంచి మేకల ఈశ్వర్ బరిలో ఉన్నప్పటికీ.. అతని పేరే చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ఓడీ చెరువు మండలానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక ప్రజల్లో ఆదరణ లభించలేదు. అంతేకాకుండా ఈశ్వర్ జనసేన నేత కావడంతో టీడీపీ నుంచి సరైన మద్దతు లేదని తెలిసింది.
మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నేత పరిసె సుధాకర్‌కు అవకాశం ఇచ్చారు. అయితే కూటమిలోని మూడు పార్టీల పెద్దలు పక్క ఊళ్లకు వెళ్లిపోవడంతో ఆయన ఒంటరయ్యారు. ఇక వైఎస్సార్సీపీ తరఫున కాచర్ల ఆంజనేయులుకు భారీ మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వయంగా ప్రచారం చేస్తుండటంతో భారీ ఊపొచ్చింది. కూటమి తరఫున మంత్రి సత్యకుమార్ (బీజేపీ) అనంతపురంలో ప్రచారం చేస్తుండగా.. పరిటాల శ్రీరామ్ (టీడీపీ) కదిరి, నల్లచెరువులో, చిలకం మధుసూదన్‌రెడ్డి (జనసేన) పుట్టపర్తి రూరల్‌లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి పరిసెన సుధాకర్ ఒంటరి అయ్యారు.
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ పెనుకొండ పట్టణ ప్రజలందరికీ సుపరిచితుడైన వాల్మీకి శ్రీనివాసులు వైఎస్సార్సీపీ తరఫున పెనుకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగారు. సీనియర్ కావడంతో పాటు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందికి సుపరిచితుడు కావడంతో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు కూటమి పార్టీల తరఫున టీడీపీ నేత త్రివేంద్రమూర్తి బరిలో దిగారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనపై చూపుతోందని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు పెనుకొండలో మంత్రి సవిత ప్రచారానికి వెళ్లగా.. జనసేన కార్యకర్తలే ఆమైపె తిరగబడ్డారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కూటమి అభ్యర్థులకు మిత్రపక్షాల నుంచి మద్దతు లేదని తెలుస్తోంది.
పొత్తులో భాగంగా మడకశిర మున్సిపల్ చైర్మన్ సీటును జనసేనకు ఇచ్చారు. అయితే టీడీపీ నేతలు పక్కా ప్లాన్‌తో ఆయన నామినేషన్ తిరస్కరణయ్యేలా చూశారు. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తమ్ముడి సతీమణి గుండుమల శారద అప్పటికప్పుడు జనసేనలో చేరి బీ–ఫారం సమర్పించారు. దీంతో జనసేన కార్యకర్తలు అసమ్మతిగా ఉన్నారు. కూటమి పార్టీల ఆగడాలను గమనించిన పట్టణ ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు తిరిగారు. అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఓం కుమార్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. కూటమి ధర్మం పాటించకుండా మిత్రపక్షాలను గుండుమల తిప్పేస్వామి అణచివేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా సతీమణి అత్తార్ పర్వీన్ కదిరి మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో టీడీపీ అంచనాలు తారుమారయ్యాయి. కూటమి తరఫున అభ్యర్థి ఎంపికలోనే మల్లగుల్లాలు పడ్డారు. చివరికి మైనార్టీలకే అప్పజెప్పారు. మరోవైపు కదిరి ఎమ్మెల్యే కందికుంటతో వివాదం కారణంగా జనసేన, బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం తెలిసిందే. పరిటాల శ్రీరామ్‌ను నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా తెచ్చుకోవడం ‘తెలుగు తమ్ముళ్ల’కు రుచించడం లేదని తెలిసింది.
సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో మైనార్టీ ఓటర్లే కీలకం. వైఎస్సార్సీపీ తరఫున డి.షాజియా బరిలో దిగారు. కూటమి పార్టీల నుంచి టీడీపీ నేత మంజునాథ్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. పట్టణంలో మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో షాజియాకు భారీగా మద్దతు లభిస్తోంది. దీంతో తాము గెలవలేమని తెలుసుకున్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే బాలకృష్ణనే రంగంలోకి దింపారు. రెండు రోజుల క్రితం బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి హిందూపురంలో ప్రచారం చేశారు. ఇన్నాళ్లూ కనిపించని బాలకృష్ణ కేవలం ఎన్నికల సమయంలో ప్రత్యక్షం కావడంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బహిరంగ ప్రచారానికి మరో 24 గంటలే గడువు ఉండటంతో ప్రచారం జోరు పెంచారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి
వివరిస్తూ ఓట్లు అడుగుతున్న
వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ
ఆదరణ లభిస్తుండగా...రెండున్నరేళ్ల కూటమి పాలనలో చేసిన మంచి ఏమీ లేక...నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కూటమి అభ్యర్థుల ప్రచారానికి స్పందన కరువైంది.
కదిరిలో అత్తార్.. హుషార్..
అవినాష్.. ఫుల్ జోష్..
హిందూపురం.. మైనార్టీల పరం..
మడకశిరలోనూ ‘ఫ్యాన్’ జోరు..
పెనుకొండ.. శ్రీనివాసులుకు అండ..
ధర్మవరంలో చేనేతల భారీ మద్దతు..


