కదిరిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పార్కింగ్ సౌకర్యం లేక ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుతుండటంతో వలీసాబ్ రోడ్డు, చౌక్ బజారు, కూరగాయల మార్కెట్, రాయలసీమ సర్కిల్, వేమారెడ్డి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్, జీవీమాను సర్కిల్, కోనేరు సర్కిల్, రాయచోటి రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. సాయంత్రం వేళ ఈ సర్కిల్ మీదుగా వెళ్లాలంటే ట్రాఫిక్‌తో ఇబ్బందిగా మారింది. 13, 14, 15 వార్డుల్లో డ్రైనేజీ కాలువ లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. వాసన భరించలేకపోతున్నాం. దీనిపై కాలనీవాసులం ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.
– జగన్, కదిరి


