మడకశిర: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన మడకశిర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే బ్యాలెట్ బాక్సులను భద్ర పరిచే స్ట్రాంగ్ రూంను కూడా ఆయన పరిశీలించారు. వడ్రపాళ్యం, శివాపురం పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించి పరిశీలన చేశారు. మున్సిపల్ అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా భద్రత కల్పించాలన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ స్వేచ్ఛగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట ఆర్డీఓ నాగ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ శివప్రసాద్, సీఐలు శివరాముడు, రాజ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మురళీధర్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
గోరంట్ల: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గోరంట్ల పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, మందలపల్లి ఉన్నత పాఠశాలల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురువారం రాత్రి ఎస్పీ సతీష్‌కుమార్ పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానిక సీఐ బోయ శేఖర్‌ను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి


