ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గురువారం ఆయన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 1వ తేదీన ఉంటుందని, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఈనెల 31వ తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు చేరుకుని ఎన్నికల సామగ్రి తీసుకువెళ్లాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఈనెల 30వ తేదీనే మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించామన్నారు.

పాఠశాలలకు సెలవు..

మద్యం దుకాణాల బంద్‌..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలలకు నవంబర్‌ 4, 5వ తేదీల్లో, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించే విద్యాసంస్థలకు నవంబర్‌ 7వ తేదీన సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్‌ 5వ తేదీన పోలింగ్‌ జరగనుండగా 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్‌ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్‌ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించామన్నారు. అలాగే నవంబర్‌ 7వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఆ రోజు కూడా కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశించామన్నారు.

పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీల్లో

మద్యం దుకాణాలు బంద్‌

ఆయా ప్రాంతాల్లోని

పాఠశాలలకూ సెలవులు

కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement